హైద్రాబాద్లో దారుణం.. మూడోసారి ఆడపిల్ల పుట్టడంతో..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించడంతో దారుణానికి ఒడిగట్టిన తల్లిదండ్రులు.
ఘటన సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వనస్థలిపురంలో నివాసముంటున్న దుర్గాప్రియా అనే దంపతులకు గత నెల 21 న ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించింది. తమకు వరసగా మూడోసారి కూడా ఆడబిడ్డ జన్మించడంతో ఆ పాపను ఆశావర్కర్ సహాయంతో విక్రయానికి పాల్పడ్డారు. బాలానగర్ కు చెందిన కవితకు ఆ ఆడబిడ్డను రూ. 80 వేలకు విక్రయించారు. దుర్గాప్రియ తల్లి రాజేశ్వరికి అనుమానం రావడంతో ఏలూరు నుండి నగరానికి చేరుకుంది. నగరానికి చేరుకున్న రాజేశ్వరికి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో 15 రోజుల క్రింద జన్మించిన తన మూడో మనవరాలు కనిపించకపోవడంతో తన కుమార్తెను గట్టిగ నిలదీసింది. పాపను ఎవరో కిడ్నప్ చేశారని దుర్గాప్రియా రాజేశ్వరికి తెలిపింది. కానీ రాజేశ్వరి కి అనుమానం రావడంతో ఆలస్యంగా విషయం బయటికి వచ్చింది. తన మనవరాలిని విక్రయించారని తెలుసుకున్న రాజేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు పాపను కవిత వద్ద నుండి తీసుకొని రాజేశ్వరికి అప్పగించారు. పసి పాపను విక్రయించినందుకు దుర్గాప్రియ దంపతులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.