జగనన్న పాలనలో సంక్షేమవిప్లవం: శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
- అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ది…
- గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజాసమస్యలుకు చెక్…
- సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామంలోని రోడ్డువారిపల్లె, ఎస్ టి కాలనీ,చెరువు క్రింద పల్లె, వంగిమళ్ళవాండ్లపల్లె, జానంవాండ్లపల్లె కొత్తపల్లె లలోజరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
ఆర్.బి.ఎం: జగనన్న పాలనలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామంలో ఉదయం 7 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించి గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డువారిపల్లె, ఎస్ టి కాలనీ, చెరువుక్రిందపల్లె,వంగిమల్లవాండ్లపల్లె, జానంవాండ్లపల్లె కొత్తపల్లె లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికార బృందంతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు .
గ్రామంలోని పల్లెల్లో ప్రతి గడప కూ శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ప్రజా సమస్యలు ఆరా తీయడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు . మరింత మెరుగైన పాలన సాగించేందుకు, ప్రజా సనస్యలును తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ మూడేళ్ళ కాలంలో తొంభై ఐదు శాతానికి పైగా సీఎం జగన్ నెరవేర్చారన్నారు.కరోన వంటి విపత్కర పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, చెప్పిన సమయానికి ముందుగానే సంక్షేమ ఫలాలను అందిస్తున్నా రన్నారు.అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. ఆదర్శంగా, పారదర్శకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేయడం జరుగుతోందన్నారు. మరింత మెరుగ్గా పాలన అందిస్తామని, ఇందుకు ప్రజల సహకారం, సూచనలు, సలహాలు అందివ్వాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.