మరోసారి వాయిదా..నిరాశలో విద్యార్థులు

హైదరాబాద్ : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. బుధవారం జరగాల్సి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఫీజులు ఒక కొలిక్కి రాకపోవడంతోనే రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ఇక..అక్టోబరు 11 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 11,12న రెండో విడత స్లాట్ బుకింగ్ స్టార్ట్ కానుంది. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత 16వ తేదీన రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు కూడా జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.