లీకైన బాలయ్య కొత్త సినిమా ఫైట్ సీన్ వీడియో..

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక వెంటనే బాలయ్య మరో ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. తాజాగా ఈ టర్కీ షూటింగ్ నుంచి ఒక వీడియో లీకై బయటకు వచ్చింది. ఆ లీక్ అయిన వీడియోలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ షర్ట్ తెల్ల పంచె కట్టుకొని దుండగులతో పోరాడుతున్నట్లు కత్తితో వారికి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా షూటింగ్ టర్కీలో ఇలా పంచెలతో చేయడం మీద కూడా కాస్త భిన్న స్పందన వ్యక్తం అవుతోంది. అయితే.. వీడియో లీక్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.