గురువుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా.
రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…
గురువుల సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష అన్నారు. రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులు కలసి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫయాజ్ బాషా మాట్లాడుతూ విద్యార్థుల భసవిష్యత్తుకు దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులేనన్నారు.ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి,పిఆర్టియు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాస రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ భాస్కర్, కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా,సాదిక్ అలీ, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,జయన్న నాయక్ నాయకులు జాకీర్, ఫయాజ్ అహమ్మద్, మాజీ కో అప్షన్ జాఫర్ అలీఖాన్, గంగిరెడ్డి, కొత్తిమీర ప్రసాద్, జావీద్, జానం రవీంద్ర యాదవ్, సంజీవయ్య, రియాజ్, విక్కీ దేవేంద్ర, ఏవిరమణ,అమీర్ తదితరులు పాల్గొన్నారు.