డ్రగ్స్ కేసులో రకుల్ విచారాణ.. కీలక అంశాలు వెలుగులోకి..

డ్రగ్స్ కేసులో రకుల్ విచారాణ.. కీలక అంశాలు వెలుగులోకి..

ఆర్.బి.ఎం హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే రకుల్‌ను విచారించడం బాలీవుడ్, టాలీవుడ్‌లో కలకలం రేగుతోంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులోనూ గత ఏడాది ఇదే నెలలో రకుల్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. ముంబైలో నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా హైదరాబాద్‌లో ఈడీ రకుల్‌‌ను విచారించడం బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. నటుడు నవదీప్‌కు చెందిన ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ ఖాతాకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్‌లో ఆమె ఆర్థిక లావాదేవీలపైనా చర్చించినట్లు ఆధారాలను సంపాదించింది. ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ మేనేజర్‌తో పాటు నవదీప్ కూడా ఈ నెల 13 న విచారణకు హాజరుకానున్నారు.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ ప్రీత్‌ విచారణకు హాజరయ్యారు. మిగిలిన 9 మంది సినీ ప్రముఖులను విచారించేందు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఈడీ తదుపరి విచారణను ఎదుర్కొనబోతున్న వారిలో దగ్గుబాటి రానా, రవితేజ, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌ను ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు వచ్చే వారందరు బ్యాంక్ స్టేట్‌మెంట్స్, వ్యాపార లావాదేవీలు, తీసుకురావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ స్టేట్‌మెంట్‌తో పాటు ఇప్పటికే ఈడీ సేకరించిన ఆధారాలు కీలకంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.