టీడీపీలో అంతర్గత కుమ్ములాట… చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తమ్ముళ్లు

tdp chandrababu

టీడీపీలో అంతర్గత కుమ్ములాట… చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తమ్ముళ్లు

ఆర్.బి.ఎం అమరావతి: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. అధినేత చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లులు తలనొప్పిగా తయారవుతున్నారు. నేతలను శాంతింపుజేసేందుకు ఆ పార్టీ అధినేత బాబుకు తలకుమించిన భారం అవుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్లు బుచ్చయ్య చౌదరి అధిష్టానంపై అసంతృప్తితో రాజీనామా దాక వెళ్లారు. ఆయన్ను శాంతిపజేసి సెట్ చేసేలోపే.. ఆపార్టీలోని సీనియర్లు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మరోనేత ఆరోపణలు చేయడంతో కలకలం రేగింది. టీడీపీ కార్యకర్తలను ఏ నాయకుడు పట్టించుకోలేదని, అధినేత చంద్రబాబు ఇకనైనా మేల్కోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, వారిని జైల్లో వేస్తుంటే ఎవరు అండగా నిలబడ్డారో చెప్పాలన్నారు. జిల్లాలో ఇద్దరు నేతల కనుసన్నల్లో వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published.