అగ్నిప్రమాద బాధితునికి అండగా ఉంటాం… ప్రమాద సంఘటనా స్థలిని పరిశీలించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి…

అగ్నిప్రమాద బాధితునికి అండగా ఉంటాం… ప్రమాద సంఘటనా స్థలిని పరిశీలించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి…

ఆర్.బి.ఎం:  సంబేపల్లె మండలం శెట్టిపల్లె కస్పాలో జరిగిన అగ్నిప్రమాద బాధితుడు ఫజిల్ కు అండగా ఉంటామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో శుక్రవారం రాత్రి ఫజిల్ కు చెందిన చిల్లర అంగడి మరియు నివాసం ఉన్న ఇల్లు పూర్తిగా కాలి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.శనివారం ఉదయం ప్రమాద సంఘటనా స్థలిని శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాద సంఘటనకు గల కారణాలును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం అందేలా చేసి బాధితునికి తోడుగా నిలుస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

శెట్టిపల్లె గ్రామ సమస్యలపై ఆరా…

శెట్టిపల్లె గ్రామ సమస్యలపై స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీటి సమస్యలపై ఆరా తీశారు. ఆడవికమ్మపల్లె, పెద్దబిడికి లలో త్వరలోనే సెల్ టవర్లును ఏర్పాటుకు కృషిచేస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రనాధ రెడ్డి, గొర్ల రమేష్ నాధ రెడ్డి,సర్పంచ్ వెంకటరమణ నాయక్,ఎర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి,లక్ష్మీకర్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి, మాజీ ఎంపిటిసి శివయ్య, ఆనంద కుమార్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ బుల్లి వెంకట రమణ, తిరుపాల్ నాయక్, కిషోర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ జాఫర్,నౌషాద్, ముబీల్, ఖాదర్ బాష, మదన మోహన్ రెడ్డి, శంకరయ్య నాయుడు, దేరంగుల రమేష్, క తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *