క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: శ్రీకాంత్ రెడ్డి

క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: శ్రీకాంత్ రెడ్డి

  • వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలను కించపరి చేలా చంద్రబాబు వ్యాఖ్యలు..
  • రాష్ట్రంలో వంద క్లబ్‌లను సీఎం వైయస్‌ జగన్‌ మూయించారు..
  • కడపలో జరిగిన మీడియా సమావేశంలో జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి తో కలసి మీడియా సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం:  ప్రతిపక్ష నేత చంద్రబాబు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రజలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఖండించారు. మంగళవారం కడపలో జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి తో కలసి శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కడప జిల్లా ప్రజలను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వంద క్లబ్‌లను మూయించారని తెలిపారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ..తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్‌ లైఫ్‌ కల్చర్‌ ఏర్పాటు చేశానని చెప్పారని గుర్తు చేశారు.డిస్కోలు, బార్‌లు, పబ్‌లు, క్యాసినోలే నైట్‌ లైఫ్‌ అన్నారు. వీటిని చంద్రబాబే ప్రోత్సహించారని తెలిపారు. నైట్‌ లైఫ్‌ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రభుత్వంపై చంద్రబాబు కవాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

సంస్కృతంలో భాగంగా సంక్రాంతి పండుగకు మనం ఎన్నో ఏళ్ల నుంచి కోస్తా జిల్లాల్లో ఆనవాయితీగా వస్తున్నవి రోటిన్‌గా జరుగుతుంటాయి. టీడీపీ హయాంలో కూడా ఇలాంటివి జరిగాయన్నారు. వైయస్‌ జగన్‌ ఇలాంటి ఆనవాయితీని కొనసాగకుండా ఆపేసి ఉంటే..వెంటనే చంద్రబాబు తన డబుల్‌ గేమ్‌ను బయటకు తీసేవారు. వైయస్‌ జగన్‌ సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించేవాడు.

ప్రజల ఆనందాన్ని అడ్డుకుంటున్నారని, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించేవారు. రోటిన్‌గా జరిగితే..రాష్ట్రమంతా జూదంగా మారిందని మాట్లాడుతారు. చంద్రబాబు హయాంలో బెల్ట్‌ షాపులు పెడితే..వాటిని మూయించారు. ఎన్టీరామారావు మద్యపాన నిషేదం పెడితే..దాన్ని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుది.

ఉద్యోగులు టీడీపీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే..చంద్రబాబు ఈ సంఘాల అంతు చూస్తా..తోకలు కత్తరిస్తానని బెదిరించాడు. ఈ రోజు సంఘాలన్ని ఏకతాటిపైకి రండి అని పిలుపునిస్తున్నారు. ఈ రోజురాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోంది. కరోనా రాని సమయంలో ఉద్యోగులు అడగకపోయినా కూడా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఐఆర్‌ 27 శాతం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఐదు డీఏలు ఇస్తే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తున్నారు.

వైయస్‌ జగన్‌ ఇస్తున్న రూ.10 వేల కోట్ల భారం ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం… సీఎం వైఎస్‌ జగన్‌ గారిని దూషించడం మంచిది కాదని హితవు పలికారు.ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని కుట్రలు చేస్తున్న వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దని సూచించారు.MLA,MLC లు జీతాలు లేకుండా ప్రజాసేవ చేస్తాం ..ఉద్యోగులు ఒప్పుకుంటారా..?అని ఆయన ప్రశించారు.టీడీపీ, బీజేపీలకు ప్రజల సంక్షేమం అవసరం లేదు..వారికి రాజకీయాలే ముఖ్యంమని ఆయన ఎద్దేవా చేశారు.సీఎంను మానవ బాంబ్‌తో చంపుతామంటారు..!!మంత్రులను, ఎమ్మెల్యేలను చంపేస్తామంటారా..?టీడీపీ నేతలు అరాచకవాదుల్లా తయారయ్యారని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published.