ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి: శ్రీకాంత్ రెడ్డి

ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి: శ్రీకాంత్ రెడ్డి

  • జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి…
  • ప్రభుత్వాసుపత్రులలో కోవిడ్ చికిత్సలు లభ్యం…చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం:  అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పక కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు.కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల జబ్బు తీవ్రత తగ్గుతుందన్నారు. రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఒక పాజిటివ్ రోగి అడ్మిషన్ అయి వైద్యసేవలు పొందడం జరుగుతోందన్నారు.కోవిడ్ ను ఎదుర్కొనేందుకు పి హెచ్ సి లు, ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

జ్వరం తదితర లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని వైద్యం పొందాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నవారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గాలి తీసుకోవడంలో ఇబ్బంది, నీరసంగా ఉన్నవారు తక్షణమే వైద్యులను సంప్రదించి తగు వైద్యపరీక్షలు చేయించుకుని ,వైద్యం పొందాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం , మాస్క్ ధారణ , భౌతిక దూరం తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు.ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పూర్తి ఇబ్బందులు పడుతోందన్నారు.లక్షలాది కేసులు అమెరికా తదితర దేశాలలో వచ్చాయని,మనదేశంలో కూడ అధికంగా కేసులు నమోదవుచున్నా యన్నారు.వ్యాక్సినేషన్ తో ప్రమాదకరం తప్పుతోందన్నారు.ఫ్రంట్ లైన్ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్ పక్రియ పూర్తయిందన్నారు. జ్వరం ,జలుబు, దగ్గు తదితర ఇబ్బందులున్న వారు వైద్యుల సలహామేరకు ఈ మందులు వాడాలని ఆయన సూచించారు.

ఆజీబెస్ట్ 500- ఒకొక్క మాత్ర -మూడు రోజుల పాటు

సిట్రజిన్: రోజుకు రెండు సార్లు చొప్పున- ఐదు రోజుల పాటు

డోలో 650- తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు

రాంటాక్: రెండు పూటలా

జింకోవిట్ : మధ్యాహ్నం వేళ-15 రోజుల పాటు.

అందుబాటులో హెల్ప్ డెస్క్

రాయచోటి ఏరియా ఆసుపత్రిలోని హెల్ప్ డెస్క్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్: 8019155009.

కోవిడ్ బాధితులకు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధంగా ఉందన్నారు.ప్రతి పి హెచ్ సి లో ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కోవిడ్ నిర్దారణ పరీక్షలును కూడా ముమ్మరం చేయడం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.