రైల్వే ఆసుపత్రిలో కుడా కోవిడ్ బూస్టర్ టీకా : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

రైల్వే ఆసుపత్రిలో కుడా కోవిడ్ బూస్టర్ టీకా : ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం: సికింద్రాబాద్ లోని లాలాగుడా కేంద్రీయ రైల్వే ఆసుపత్రి లో సైతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ బూస్టర్ టీకా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రైల్వే ఆసుపత్రిలో కూడా బూస్టర్ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదవీ విరమణ చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, ఇతర అర్హత వర్గాల వారికి టీకాను అందించేందుకు ఏర్పాట్లు జరపాలని రైల్వే మజ్దూర్ యునియన్ నేతల విజ్ఞప్తి మేరకు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. తీగుల్ల పద్మారావు గౌడ్ విజ్ఞప్తి కి స్పందించిన అధికారులు రైల్వే ఆసుపత్రి లో బూస్టర్ టీకా సదుపాయం కల్పించే ఏర్పాట్లు జరపాలని నిర్ణయించారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పద్మారావు గౌడ్ కు తెలిపారు. గతంలో కూడా లాలాగుడా రైల్వే ఆసుపత్రిలో కోవిడ్ టెస్టింగ్ కేంద్రం, కోవిడ్ వైద్య సేవలు, వాక్సినేషన్ కేంద్రాన్ని పద్మారావు గౌడ్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసింది. కాగా బూస్టర్ డోస్ ఏర్పాటు సదుపాయాన్ని అందించందుకు పద్మారావు గౌడ్ చొరవ చూపడం పట్ల రైల్వే మజ్దూర్ యునియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సీ హెచ్ శంకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే హెల్త్ కేర్ వర్కర్లు, వైద్య సిబ్బంది తో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు బూస్టర్ అందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published.