రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన నిర్మాణం పనులను పరిశీలించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన నిర్మాణం పనులను పరిశీలించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం: దశాబ్దాల సికింద్రాబాద్ ప్రజల కలను నెరవేర్చేందుకు ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలకే పరిమితంగా నిలిచిన తుకారంగేట్ రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన (ఆర్ యు బీ) నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలంగాణ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన ఆర్ యు బీ- నిర్మాణం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పురోగతిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరవాత తమ చొరవతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగిందని పద్మారావు గౌడ్ వివరించారు. రూ.29 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకు పై గా నిధులను ఇప్పటికే మంజూరు చేసిందని, అదే విధంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సైతం ఇప్పటికే నిధులను మంజూరు చేయించినట్లు తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. రూ. 29.50 కోట్ల మేరకు ప్రాజెక్ట్ నిధులకు అదనంగా రోడ్డు విస్తరణ పనులకు నిధులను మంజూరు చేశామని అయన తెలిపారు. పనులను వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. కొత్త రహదారిని సిద్దం చేయాలనీ, దానిని వినోయోగించుకొనే పౌరుల భద్రతను కుడా దృష్టిలో ఉంచుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. అన్ని పనులను పూర్తీ చేసి మార్చి తోలి వారానికి ఆర్ యు బీ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అయన ఆదేశించారు. GHMC డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, ఈ ఈ లు గోపాల్, రఘు లతో పాటు వివిధ విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.