జగనన్న మేలు మరువలేను..
ఆర్.బి.ఎం: జగనన్న మేలు మరువలేనంటూ సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన చిట్టెమ్మ అనే డయాలసిస్ పేషంట్ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డయాలసిస్ పేషంట్ చిట్టెమ్మ ఇంటికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లారు. సార్ ..నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం, డయాలసిస్ చేయిస్తున్నారని, అంతేకాకుండా పదివేల రూపాయల పెన్షన్ ను నెల నెలా ఇంటికే పంపిస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి కి వివరించి జగన్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది .ఈ ప్రభుత్వమే లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదోనని ఆమె దీనంగా చెప్పింది.