కలల కొలువు దక్కింది…

కలల కొలువు దక్కింది…

ఆర్.బి.ఎం: 24 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తన కలల కొలువు సీఎం జగన్ తో నెరవేరిందని 1998 డీఎస్సీ క్వాలిపైడ్ అభ్యర్థి ,సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీ గ్రామం గొల్లపల్లె కు చెందిన తోక వెంకటరమణ పేర్కొన్నారు. సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీ గ్రామం గొల్లపల్లెలో ఆదివారం వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటనలో 98 క్వాలిఫైడ్ అభ్యర్థి తోక వెంకట రమణ ఇంటికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లగా…తాను 98 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థినని, తమను ఉద్యోగాలలోకి తీసుకోవాలని ఎన్నో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, తమ సమస్యలుపై సీఎం జగన్ స్పందించి ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించడం మసకబారిపోతున్న తమ జీవితాలలో వెలుగులు నిండాయంటూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఎదుట తోక వెంకట రమణ ఆనందం వ్యక్తం చేశారు. తెలిపారు.ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందంటూ సీఎం జగన్ కు తోక వెంకటరమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.