కంచాలమ్మ గండి చెరువుకు జలహారతి పట్టిన శ్రీకాంత్ రెడ్డి..

కంచాలమ్మ గండి చెరువుకు జలహారతి పట్టిన శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం రాయచోటి: రాయచోటి మండలం ఎగువ అబ్బవరం సమీపంలోని కంచాలమ్మ గండి చెరువుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జలహారతి పట్టారు. శనివారం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ లతో కలసి ఆయన జలహారతిలో పాల్గొని, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూనిండిన చెరువులు, కుంటలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

కంచాలమ్మ గండి చెరువుకట్ట బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కంచాలమ్మ గండి లో రెండు రోజులుగా 14వేల క్యూసెక్కులు వరదనీరు వెల్లుతోందని ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, ఏఈ బాష లు చీఫ్ విప్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫయాజ్ అహమ్మద్, రియాజుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.