నిండు కుండల్లా ఉన్న చెరువులపై పర్యవేక్షణ ఉండాలి… శ్రీకాంత్ రెడ్డి

నిండు కుండల్లా ఉన్న చెరువులపై పర్యవేక్షణ ఉండాలి… శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం రాయచోటి: జవాద్ తుఫాను ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయచోటి ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సహకారం సంతృప్తిని ఇస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా 180 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంపై ఆశ్చర్యాన్ని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని మండలాల అధికారులు, ఆయా ప్రాంతాల్లో ని పార్టీ నాయకులతో మాట్లాడుతూ జరిగిన నష్టాలు, ప్రజల ఇబ్బందులు, ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, నదులు, వాటి పరివాహక ప్రాంతాల ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

అనేక చోట్ల సంభవించిన వరద విఫత్తులను ఎదుర్కొనేందుకు.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని.. అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉన్నా అక్కడి నుంచి వరద సహాయక చర్యలపై.. సంబందిత అధికారులతో ఆయన మాట్లాడుతూ వచ్చారు.. నియోజకవర్గ పరిధిలోని వెలిగళ్లు, జరికొన, గంగనేరు ప్రాజెక్టులకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుల నీటిమట్టంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా రాయచోటి పట్టణంపై భాగంలో ఉన్న కంచాలమ్మ గండి చెరువు కట్ట పరిటితులపై అడిగి తెలుసుకున్నారు. అలాగే మేజర్, మైనర్ ఇరిగేషన్ అధికారులు నదీ పరివాహక ప్రాంతాలు, చెరువుల నీటిమట్టంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా ప్రాణనష్టం, పశు సంపద నష్టం గానీ సంభవించి ఉంటే.. సంబందిత శాఖల అధికారులు తక్షణమే.. ఆ వివరాల నివేదికలు పంపించాలన్నారు. అలాగే.. వరద ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలను రోడ్లు, భవనాల శాఖ, పీఆర్ అధికారులు.. వాటిని వెంటనే పునరుద్ధరింపజేయాలన్నారు.

పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం, మంచినీరు కలుషితం కాకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. బోయపల్లెలో ఇల్లు కూలి చనిపోయిన గొర్రెల కాపరికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. రాయచోటిలోని నది పరివాహక ప్రాంతాలు, యండపల్లె, పెద్దకాల్వపల్లెల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అందిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

వరద సహాయక చర్యల్లో భాగంగా.. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ప్రజలను చేర్పించడం, మంచినీటి ప్యాకెట్లు, ఆహారం సరఫరా సరఫరా, అత్యవసర మందుల సరఫరా సంసిద్దంగా ఉంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రెటరీలు, వి ఆర్ ఓ లు అప్రమత్తంగా ఉంటూ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. పబ్లిక్ హెల్త్ సిబ్బంది ప్రజల ఆరోగ్య స్థితిపై దృష్టి సారించి.. ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు.. ఎలాంటి విద్యుత్ అసౌకర్యం, ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విద్యుత్ సౌకర్యాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని తక్షణమే పునరుద్దరించాలని శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమనిపిస్తేముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో ఇంకనూ నివాసాలు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగివుంటే.. అంచనా వేసి సంబంధిత అధికారులు వెంటనే నివేదికలను సమర్పించాలన్నారు. డివిజన్, మండల స్థాయి వరకు ఉన్న రెవిన్యూ అధికారులతో పాటు పోలీసు, ఫైర్, రెస్క్యూ టీమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు

Leave a Reply

Your email address will not be published.