సైబర్ నేరాలపై అవగాహన సదస్సు..
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని 1650 పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి 50 పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యా శాఖ తరఫున ఆ జిల్లా లో పని చేస్తున్నటువంటి కోఆర్డినేటర్లు జి సి ఓ లు నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తెంచుకొని వారికి ఈ అంతర్జాలంలో జరుగుతున్నటువంటి నేరాలపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీరితో పాటు ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు మెంటల్ టీచర్ గా వ్యవహరిస్తారు. గత నాలుగు నెలలుగా ఈ అంశంపై ఇద్దరు విద్యార్థులకు ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1650 పాఠశాలలో భౌతికంగా మొదటిసారిగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ మరియు విద్యాశాఖ అనుసంధానంగా పని చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ వారి ఆధ్వర్యంలో లో బాలికల కు ప్రత్యేక జాగ్రత్తలు మరియు అననుకూల సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అలాగే సైబర్ నేరాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది..