రైతు శ్రేయస్సే జగన్ ప్రభుత్వ ధ్యేయం..: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

రైతు శ్రేయస్సే జగన్ ప్రభుత్వ ధ్యేయం..: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం రాయచోటి: రైతు శ్రేయస్సే జగన్ ప్రభుత్వ ధ్యేయమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.అకాల వర్షాల వల్ల నష్టపోయిన వరి రైతులుకు చెప్పిన విధంగానే అండగా ప్రభుత్వం ఉందన్నారు. అధిక వర్షాల వల్ల పంట చేతికి అందుతున్న సమయంలో వరి పంట పూర్తిగా మునిగిపోయి నష్టం జరిగిందన్నారు.పంట నష్టపరిహార నివేదికలును తయారుచేయమని ప్రభుత్వం నుంచి అధికారులుకు ఆదేశాలు అందాయన్నారు.క్రాప్ బుకింగ్ చేసుకుని నష్టపోయిన ప్రతి రైతుకూ అర్హత వుంటుందన్నారు.

ఇది రైతుల ప్రభుత్వమని, చెప్పిన మేరకు రైతులకు తోడుగా నిలుస్తుందన్నారు.రైతన్నకు నష్టం జరిగినప్పుడు సకాలంలో స్పందించే ప్రభుత్వమని మరోసారి రుజువు అయిందన్నారు.ఏ ఒక్క చోట రాజకీయాలకు చోటివ్వకుండా, స్వార్థం లేకుండా, అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా వేగవంతమైన చర్యలు చేపట్టిందన్నారు.

రైతును రైతుగా చూసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఆశయం మేరకు మీ నివేదికలు ఉండాలని అధికారులును కోరామన్నారు.పారదర్శకత కోసమే ఈ క్రాప్ పద్ధతిని పెట్టడం జరిగిందన్నారు. రాబోవు రోజులలో కూడా రైతన్నలు ఏ పంట పెట్టినా సంబంధిత రైతు భరోసా కేంద్రాలలోని వ్యవసాయ అధికారులు, సిబ్బంది ద్వారా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని ఆయన కోరారు.

రబీలో వర్షాల వల్ల మొలకఎత్తని బుడ్డ శనగ రైతులకు తిరిగి విత్తుకోవడానికి 80 శాతం రాయితీతో సరఫరా చేస్తున్నారని, అదే రకంగా రబీలోవేసి వేరుశనగ మొలకెత్తని రైతులుకు తిరిగి పంట పెట్టేందుకు 80 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని నేడు ముఖ్యమంత్రి జగన్ నుకోరుతున్నానని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేలా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కొన్ని చోట్ల విత్తనాలు సరిగా లేవన్న విమర్శలు వినపడుతున్నాయని, అటువంటి ఫిర్యాదులు ఎక్కడ కూడా రాకూడదని ఆయన సూచించారు.

రైతన్నలు సరైన అదును చూసుకుని, వ్యవసాయ శాఖ సలహాలు,సూచనలు పాటించి పంటలు సాగుచేయాలని, నీటితో ఊటెక్కే భూములలో వరి, మెట్ట భూములలో సాధ్యమైనంత వరకు చిరుధాన్యపంటలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు.రైతు భరోసా కేంద్రాలలో చిరుధాన్యాల సరఫరాకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రొద్దుతిరుగుడు విత్తనాలును సబ్సిడీతో ఇవ్వలేక పోయినా ..మార్కెట్ రేటుకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ కమీషనర్ ను కోరామన్నారు.

Leave a Reply

Your email address will not be published.