ఈటల భుజం తట్టి అభినందించిన గవర్నర్

ఈటల భుజం తట్టి అభినందించిన గవర్నర్

ఆర్.బి.ఎం హైదరాబాద్: గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ఈ బృందంతో పాటు ఈటల రాజేందర్ కూడా రాజ్‌భవన్ వెళ్లారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన రాజేందర్‌ను గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈటలను ప్రత్యేకంగా పలిచి కష్టబడి గెలిచారానని భుజం తట్టి మరీ అభినందించారు. ఈ విజయం హుజురాబాద్ ప్రజలదని ఈటల వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆయన చెప్పారు.

ఇక వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ గవర్నర్‌తో భేటీ అయిన వారిలో ఈటల, రఘనందనరావు, రాజసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. నల్గొండలో జరిగిన దాడి ఘటనను బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీకి అధిష్టానం సూచించింది.

Leave a Reply

Your email address will not be published.