మహిళల మోములలో చిరునవ్వులు చూడాలన్నదే జగనన్న లక్ష్యం…
- అక్క చెల్లెమ్మలుకు అండగా వైఎస్ఆర్ ఆసరా…
- జగనన్న మాట ఇచ్చారంటే నెరవేరుస్తారంతే…
- పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్దే జగన్ ప్రభుత్వ లక్ష్యం…
ఆర్.బి.ఎం: రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లె, సుద్దమల, కల్పనాయుని చెరువు లలో జరిగిన రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా పథక ప్రారంభంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
మహిళల జీవితాలలో వెలుగులు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రామాపురం మండలం లోని నల్లగుట్టపల్లె , సుద్దమల, కల్పనాయుని చెరువు లలో వేర్వేరుగా జరిగిన రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులలో మాజీ వైస్ ఎం పి పి జనార్దన రెడ్డి, జెడ్ పి టి సి మాసన వెంకట రమణ, సర్పంచ్ లు నాగభూషన్ రెడ్డి, లక్ష్మీదేవి, వెంకట రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుల్లు పెద్దిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి,మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, నాయకులు హుసేనయ్య, యోగాంజులు రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,వేణు, నాగబసి రెడ్డి,వైస్ సర్పంచ్ కిరణ్ కుమార్,చెన్నారెడ్డి, విశ్వనాధ రెడ్డి, సూరం వెంకట సుబ్బారెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ వైస్ ఎం పి పి మురళీ ధర రెడ్డి, వైస్ ఎం పి పి బాబు, సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణ, కృష్ణారెడ్డి ,మాజీ సర్పంచ్ వెంకట సుబ్బారెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ ఖాజాబీ, ఎం పి డి ఓ నాగరత్నమ్మ, వైఎస్ఆర్ క్రాంతిపథం ఏరియా కో ఆర్డినేటర్ వేణుమాధవ్, ఏ పి ఎం రెడ్డెమ్మ తదితరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా వైఎస్ఆర్ ఆసరా నిలుస్తుందన్నారు. అలుపెరగని పాదయాత్రలో అక్క చెల్లెమ్మలుకు జగనన్న ఇచ్చిన హామీ నేడు కార్యరూపం దాల్చిందన్నారు.
రాయచోటి నియోజక వర్గ పరిధిలో 3851 సంఘాలకు రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా క్రింద రూ 27,35,48,444 లబ్దిపొందుచుండగా, రామాపురం మండలంలో 744 సంఘాలకు రూ 5,37, 54,081 లబ్దిపొందుచున్నారన్నారు. నల్లగుట్టపల్లెలో 64 సంఘాలకు రూ 43 లక్షలు, సుద్దమల లో 38 సంఘాలకు రూ 25 లక్షలు,కల్పనాయుని చెరువులో 13 సంఘాలకు రూ 7 లక్షలు ను లబ్దిపొందుచున్నారన్నారు.
