టీటీడీ పాలకమండలి నియామకంలో స్కామ్… ఏకంగా కిషన్‌రెడ్డి పేరును వాడుకుని..

టీటీడీ పాలకమండలి నియామకంలో స్కామ్… ఏకంగా కిషన్‌రెడ్డి పేరును వాడుకుని..

తిరుమల: టీటీడీ జంబో బోర్డు నియామకంలో స్కామ్‌లు జరిగినట్లు ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. ఏకంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరును ఉపయోగించిన ఓ వ్యక్తికి బోర్డులో పదవి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కిషన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన మండిపడ్డారు. నియామకంపై సీఎం జగన్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంతో జోక్యం చేసుకోవాలని జగన్‌కు సూచించారు. అయితే ఈ స్కామ్ వెనుక వైసీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతలపై ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని చెబుతున్నారు. పాలకమండలి నియామకంలో భారీగా ముడుపులు ముట్టాయనే ప్రచారం జరుగుతోంది.

టీటీడీ పాలక మండలి జంబో పాలక వర్గంగా తయారైంది. 50మంది ప్రత్యేక ఆహ్వానితులతో, 25మంది సభ్యులతో కొలువు దీరిన టీటీడీ పాలకవర్గంలో పారిశ్రామిక వేత్తలదే పైచేయి అయ్యింది. పైగా వీరంతా గతంలో పని చేసిన, ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులు, వివిధ మార్గాలలో అనేక మంది సిఫార్సు చేసిన వారు ఉన్నారు. పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు నియామకం, 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.