పూరీ జగన్నాథ్, తరుణ్‌కు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో క్లీన్‌చిట్
హైదరాబాద్: టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్‌కు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో క్లీన్‌చిట్ వచ్చింది. పూరి జగన్నాథ్, తరుణ్ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తెలిపింది. పూరి, తరుణ్‌ల బ్లడ్, వెంట్రుకలు, గోళ్లు రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించింది. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలు సేకరించారు. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు వివరాలు ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్ శాఖ సమర్పించింది. ప్రధాన నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 9న విచారణకు హాజరుకావాలని కెల్విన్‌కు కోర్టు ఆదేశించింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా విచారించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ ఈ కేసును దర్యాప్తు చేశారు. అరవై మందికిపైగా ప్రశ్నించారు. వీరిలో టాలీవుడ్ తారలు పన్నెండు మంది వరకూ ఉన్నారు.