కడప నగరాన్ని సుందరీకరణ క్రీడా నగరంగా తీర్చిదిద్దుతాము : కడప నగర మేయర్ సురేష్ బాబు

mayor suresh babu

కడప నగరాన్ని సుందరీకరణ క్రీడా నగరంగా తీర్చిదిద్దుతాము : కడప నగర మేయర్ సురేష్ బాబు

ఆర్.బి.ఎం: కడప నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దుతామని కడప నగర మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు అన్నారు. శనివారం కడప నగరం dsa మైదానం లో చేపట్టిన నిర్మాణ పనులను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహకారం తో, సొంత నిధులు వెచ్చించి మైదానం ఆధునీకరణం చేపట్టామన్నారు. క్రీడాకారులు, వాకర్స్ కు అనుకూలంగా ఉండేలా మైదానాన్ని ఆధునీకరిస్తామని అయన తెలిపారు. అన్ని క్రీడలకు మైదానంలో చోటు కల్పించి క్రీడల కేంద్రం గా తీర్చి దిద్దుతామని తెలిపారు. రానున్న రోజుల్లో స్టేడియమ్ ఆవరణంలో రెస్టారెంట్, స్పోర్ట్స్ మెటీరియల్ స్టోర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాకీ అసోసియేషన్ సెక్రెటరీ సుభాన్ భాషా వైస్సార్సీపీ కార్పోరేటర్లు డివిజన్ ఇంచార్జిలు నాయకులు అధికారులు సూర్యనారాయణ రామలక్ష్మణ రెడ్డి పత్తి రాజేశ్వరి త్యాగరాజ సింధు బాషా మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.