నెరవేరనున్న రాయచోటి వాసులకు టి టి డి కళ్యాణ మండపం కల…

నెరవేరనున్న రాయచోటి వాసులకు టి టి డి కళ్యాణ మండపం కల…

  • పేదలు, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం రాయచోటిలో టిటిడి కళ్యాణమండపం..
  • 2.30 కోట్ల నిధుల విడుదలకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషి…
  • ఈ నెల 24 న ఉదయం 11.30 గంటలకు శంఖుస్థాపన, భూమిపూజలకు సన్నాహాలు…
  • హాజరు కానున్న ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానంలు

ఆర్.బి.ఎం:   పేదలు, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం రాయచోటిలో టి టి డి కళ్యాణమండపం ఏర్పాటు కానుంది.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రూ 2.30 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.రాయచోటి పట్టణంలోని చిత్తూరు రహదారి మార్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రక్కన 1. 65 ఎకరాల విస్తీర్ణపు ప్రభుత్వ స్థలంలో కళ్యాణమండపాన్ని అన్ని వసతులుతో నిర్మించనున్నారు .దశాబ్దాలుగా రాయచోటిలో టి టి డి కళ్యాణ మండపాన్ని నిర్మింపచేయాలని రాయచోటి వాసులు కలలుకంటూ వచ్చారు.

గత పాలకులు సైతం ఇదిగో, అదిగో అంటూ వచ్చారు తప్ప హామీని నెరవేర్చలేకపోయారు. జగనన్న ప్రభుత్వం రాగానే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి టి టి డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లి టి టి డి కళ్యాణ మండపం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించారు.వెంటనే భూసేకరణ, టెండర్ ప్రక్రియ లు పూర్తిచేయించడంలో కూడా శ్రీకాంత్ రెడ్డి కృషి మరువలేనిది.

ఈ నేపథ్యంలో ఈ నెల 24 న సోమవారం ఉదయం 11.30 గంటలకు ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయాఖానం ల చేతులమీదుగా శంఖుస్థాపన, భూమిపూజల నిర్మాణంతో రాయచోటి ప్రాంతంలోని వెనుకబడిన వర్గాల ప్రజలకు వివాహ ఇతర శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *