సర్వే తెచ్చిన తంటా..రఘురామకృష్ణరాజుకు దిమ్మతిరిగేలా కామెంట్స్..
ఆర్.బి.ఎం డెస్క్: వైసీపీ జెండాతో గెలిచి అదే పార్టీని నిత్యం విమర్శిస్తూ పలు టీవీ డెబిట్ లలో పాల్గొనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.తన నియోజకవర్గం నర్సాపురంలో తొమిది లక్షల ఫోన్ కాల్స్ తో సర్వే నిర్వహించానని ఓ టీవీ డెబిట్ లైవ్ లో పాల్గొన్న రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవలేని పరిస్థితిలో ఉందని రఘురామకృష్ణరాజు అన్నారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో అయన పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. రఘురామకృష్ణరాజు ముందు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళి గెలిచి చూపించాలని సామాజిక మాధ్యమంలో పలువురు అభిప్రాయం పడ్డారు.
రఘురామకృష్ణరాజు నెత్తి మీద బొచ్చు ఎంత నిజమో ఆ సర్వే కూడా అంతే నిజం, నర్సాపురం ఎంపీ గా గెలిపించుకొని తప్పు చేశాం,కరోనా విపత్కార సమయంలో ఒక్కసారి కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేడు అంటూ సామాజిక మాధ్యమంలో పలువురు ఈ విధంగా వ్యాఖ్యానించారు.