ఫుట్‌బాల్‌ స్టేడియంలో తొక్కిసలాట..125 మంది మృతి…

జకార్తా: ఇండోనేసియాలో ఘోరం జరిగింది. పుట్‎బాల్ మైదానంలో తొక్కిసాలాట చోటు చేసుకుంది. చిన్నారులు సహా..125 మంది దుర్మరణం చెందగా..మరో 180 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పు జావా ప్రావిన్స్ లో తూర్పు మలంగ్ నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సొంతగడ్డపై అరేమా మలంగ్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక అభిమానులు ఒక్కసారిగా 3వేల మందికిపైగా స్టేడియంలోకి దూసుకువచ్చారు. క్రీడాకారులు, నిర్వహకులపై దాడికి యత్నించారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో..టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్ కి బయపడిన ఆందోళనకారులు బయటకు వెళ్లే మార్గంలో ఈ తొక్కిసల సంభవించింది. తొక్కిసలాటలో 35 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయాలైన వారిని ఆస్పత్రి తరలించగా..కొందరు మార్గ మధ్యలోనే మరణించారు. ఈ ఘటన తెలుసుకున్న ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్ని ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకూ భద్రతాపరమైన సమీక్షలు నిర్వహించాలని, భద్రతను మెరుగుపరిచే చర్యలు పూర్తయ్యేవరకూ అన్ని మ్యాచ్‌లనూ నిలిపివేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published.