అపోలో ఆస్పత్రిలో నగరి ఎమ్మెల్యే రోజా..

అపోలో ఆపత్రిలో నగరి ఎమ్మెల్యే రోజా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నగరి నియోగకవర్గం ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్స్లు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాదే జరగాల్సిన ఆపరేషన్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. దాని తర్వాత ఎలక్షన్ నేపథ్యంలో మళ్ళి ఒక్కసారి ఆపరేషన్ వాయిదాపడింది. అయితే తాజాగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్స్లు జరిగాయని రోజా ఆరోగ్య పరిస్థిని కుదుటపడుతోంది అని ఐసీయూ నుండి ప్రత్యేక వార్డుకు రోజాను తరలించారని రోజా భర్త సెల్వమణి తెలిపారు. కొద్దిరోజుల్లోనే పూర్తిగా రోజా కోలుకుంటారని కరోనా నేపథ్యంలో రోజాను చూడడానికి ఆస్పత్రిలో అభిమానులు కార్యకర్తలు రావొద్దని తొందర్లోనే ఆమె అందర్నీ కలుస్తారని సెల్వమణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.