మైలార్దేవ్ పల్లి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
రాజేంద్రనగర్: నగర శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవ్ పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పోగలతో భయంకరంగా మరీనా పారిశ్రామిక వాడ ప్రాంతం. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో చాల వరకు ఆస్థి నష్టం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఒక్కసారి దట్టమైన పొగలు రావటం పరిశ్రమ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో అగ్నిప్రమాదం ఆలా చోటుచేసుకుందని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేరకు ఆస్థి నష్టం జరిగింది? ఈ ఘటనలో ఏమైనా ప్రాణాపాయం జరిగిందా? లాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.