మంత్రి వర్గంలోకి రోజా..!

మంత్రి వర్గంలోకి రోజా..!

ఆర్.బి.ఎం డెస్క్: విపక్షాలను ఎదర్కొవడంలో రోజా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఆమె విమర్శలు చేస్తుంటారు. రోజాకు మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాలను మరింత సమర్థవంతంగా ఎదర్కొంటుందనే సీఎం జగన్ ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ మధ్య జల జగడాలు తీవ్రస్థాయికి చేరాయి. మంత్రుల కంటే ముందగా టీఆర్‌ఎస్ నేతలకు ఆమె కౌంటరిచ్చారు. ఈ దూకుడు వళ్లే రోజాకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె దూకుడు చూసినవారంతా త్వరలోనే మంత్రి పదవి ఖాయం అంటూ చర్చించుకుంటున్నారు.

చంద్రబాబును ఎదుర్కోవడంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రోజా దూకుడుగా వ్యవహరించడం జగన్ కు చాలా నచ్చిందని.. అదే దూకుడును ఆమె కొనసాగించడం కోసమే మంత్రి పదవిలోకి తీసుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత జగన్ మనసులో ఏముందనేది అటు రోజాకు.. ఇటు జగన్ కు మాత్రమే తెలుసని.. ఈ విషయంలో ఆలోచించాల్సిందేమీ లేదంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.