కేటీఆర్ వాహనానికి చలాన్ విధించిన ఎస్ఐ.. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఎస్ఐని పిలిచి..

కేటీఆర్ వాహనానికి చలాన్ విధించిన ఎస్ఐ.. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఎస్ఐని పిలిచి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గత రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్లో వెళ్తుంటే ఆ వాహనానికి పోలీసులు చలాన్ విధించారు. కాగా తన వాహనానికి చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్యను ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి కేటీఆర్ తన ఆఫీసు కు పిలిపించుకుని అభినందించి సత్కరించారు. మంత్రి వాహనాన్ని సైతం లెక్కచేయకుండా నిబంధనల ప్రకారం చలాన్ విధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అధికార ప్రజాప్రతినిధులైన సామాన్య ప్రజలైన నిబంధనలు అందరికి ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనలు పాటించడంలో ముందుంటానని, వాహనానికి చలాన్ విధించిన సమయంలో వాహనంలో లేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.