రేవంత్ కొత్త బిచ్చగాడు: కేటీఆర్

రేవంత్ కొత్త బిచ్చగాడు: కేటీఆర్

ఆర్.బి.ఎం హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే రేవంత్‌రెడ్డి అడ్డ గాడిదనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ కొత్త బిచ్చగాడని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. 50 కోట్లకు రేవంత్ పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని వారి పార్టీ నేతలే చెబుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో పెద్ద పని లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.