పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం:ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  •  పట్టణంలోని కొత్తపేటరామాపురం చౌడమ్మ ఆలయ సమీపంలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్:పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.బుధవారం రాయచోటి పట్టణంలోని కొత్తపేటరామాపురం చౌడమ్మ ఆలయ సమీపంలో జరిగిన వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత అఖిలభారత వెనుకబడిన వర్గాల ఫోరమ్ కన్వీనర్ వండాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చీఫ్ విప్ కు, అధికారులుకు ఆత్మీయ స్వాగతం పలికారు. తాత్కాలికంగా అద్దెభవనంలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగాలలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టిందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల వైద్య సౌకర్యాలు, మౌలికవసతులును కల్పించడం జరుగుతోందన్నారు. రాయచోటి పట్టణానికి 4 వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ లు మంజూరు అయ్యాయన్నారు. ఇందులో కొత్తపేట రామాలయం సమీపంలోని 17 వ వార్డులో తాత్కాలికంగా అద్దెభవనంలో అర్బన్ క్లినిక్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇక్కడ చాలావరకు వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.పేదలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అర్బన్ క్లినిక్ లకు సొంతభవనాల నిర్మాణాల పనులు కూడా జరుగుచున్నాయన్నారు. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజల మన్ననలును పొందాలని శ్రీకాంత్ ఆదేశించారు. పేద ప్రజలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, వైద్యాధికారులు డా సునీత, డా భాను, కౌన్సిలర్లు నాగాంజలి, జయన్న నాయక్, మదన మోహన్ రెడ్డి, పల్లా రమేష్ , జానం రవీంద్ర యాదవ్ , భాస్కర్, వైఎస్ఆర్ సిపి నాయకులు యర్రపురెడ్డి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.