విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్: శ్రీకాంత్ రెడ్డి

  •  దేశంలోనే ప్రథమంగా నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టిన జగన్ ప్రభుత్వం
  • నూతన విద్యా విధానంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులుకు ఎనలేని మేలు
  • నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
  • రాయచోటి నియోజకవర్గాన్ని విద్యాపరంగా మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి
  • 16 న పాఠశాలల పునః ప్రారంభానికి సన్నద్ధంకావాలి
  • మనబడి నాడు నేడు,నూతన విద్యా విధానంపై రాయచోటి నియోజక వర్గ స్థాయి అవగాహన సదస్సులో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని సుధ కన్వెన్షన్ హాల్ లో చీఫ్ విప్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మనబడి నాడు నేడు, నూతన విద్యా విధానంపై జరిగిన నియోజక వర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత ఉపాధ్యాయ ఎం ఎల్ సి కత్తి నరసింహా రెడ్డి, ఆర్ జె డి వెంకట కృష్ణారెడ్డి, డి ఈ ఓ శైలజ, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఫయాజర్ రెహమాన్,జెడ్ పి టి సి లు వీరాంజనేయప్రసాద్, మాసన వెంకటరమణ, మాజీ జెడ్ పి టీ సి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎం పి పి లు పోలు సుబ్బారెడ్డి, గడికోట జనార్ధన రెడ్డి, అంపాబతిన రెడ్డేయ్య , యదుభూషన్ రెడ్డి, పల్లపు రమేష్, పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, తదితరులులతో కలసి జ్యోతి ప్రజల్వన చేశారు.ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజక వర్గంలో నాడు నేడు క్రింద 121 పాఠశాలల అభివృద్ధికి రూ 30 కోట్లకు పైగా నిధులును ఖర్చుపెట్టి సర్వాంగసుందరంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.రెండవ విడతలో 136 పాఠశాలలును ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండవ విడత పనులను విజయవంతంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు.చరిత్రలో ఊహించని విధంగా పాఠశాలల అభివృద్ధి జరుగుతోందన్నారు.ఈ నెల 16 న పాఠశాలల పునః ప్రారంభానికి సన్నద్ధం అయి పూర్తయిన నాడు నేడు పనులును జాతికి అంకితం చేయాలన్నారు. రెండవ విడత నాడు నేడు పనులను ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తల సహకారంతో రాయచోటి నియోజక వర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి ముందంజలో నిలుపుతానన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కూడా త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఇక్కడ మంచి భవనాలు నిర్మింపచేసి మహిళా ప్రాంగణంగా తీర్చిదిద్ది మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకువిద్య అందుతుందన్నారు.పి జి కేంద్ర ఏర్పాటుకు కూడా వచ్చే క్యాబినెట్ లో పెట్టడం జరుగుతుందన్నారు.ఆ పి జి కేంద్రాన్ని యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. మెడికల్ కళాశాల, జె ఎన్ టి యు ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషిచేస్తున్నామన్నారు. డైట్ లో రూ 12 కోట్ల నిధులుతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటి విద్యా హబ్ గా మారుతోంది: ఎం ఎల్ సి కత్తి నరసింహారెడ్డి.
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటి విద్యాహబ్ గా మారుతోందని ఉపాధ్యాయ ఎం ఎల్ సి కత్తి నరసింహారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకువస్తున్న నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలుతో 6.30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరడం చారిత్రాత్మకమన్నారు.రూ 16 వేల కోట్ల నిధులుతో నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు తప్పక జరుగుతాయన్నారు.గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది , వాలంటీర్లు కూడా ప్రాధమిక విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.పోటీతత్వ స్పూర్తితో ఉపాద్యాయులు, ప్రధానోపా ధ్యాయులు వారి వారి పాఠశాలలను అభివృద్ధి చేసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో సుస్థిర స్తానం సంపాదించుకోవాలని సూచించారు.

దేశంలోనే నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్: ఆర్ జె డి వెంకట కృష్ణారెడ్డి.

దేశంలోనే ప్రధమంగా నూతన విద్యా విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని ఆర్ జె డి వెంకటకృష్ణారెడ్డి అన్నారు.నూతన విద్యా విధానం వల్ల పాఠశాలలు అందుబాటులోకి రావడం, ప్రతి సబ్జెక్ట్ కు టీచర్, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులోకి రావడం, చదువులు బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకడం, భావనాత్మక విధానం, జీవన నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. కమ్యూనికేషన్, కో ఆర్డినేషన్, కో ఆపరేషన్ లు వుంటాయన్నారు. విద్యార్థి మంచి జ్ఞానాన్ని పొంది బాధ్యతగల పౌరుడిగా ఎదుగుతా రన్నారు. విద్యాభివృద్ధికి నిలువెత్తు రూపం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అని ఆయన తెలిపారు. నూత‌న విద్యా విధానంలో భాగంగా ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుందన్నారు.

ఇందులో సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్: పి పి -1, పిపి -2, ఫౌండేషన్ స్కూల్స్ : పి పి-1, పి పి-2, 1మరియు 2 వ తరగతులు, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్: పి పి1 నుండి 5 వరకు, ప్రి హైస్కూల్స్: 3 నుండి 7 లేక 8 వ తరగతులు, హైస్కూల్స్: 3 నుండి 10 వరకు, హైస్కూల్స్ ప్లస్: 3 నుండి 12 వ తరగతి వరకు వుంటాయని తెలిపారు.అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయన్నారు. ఈ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లను ఫౌండేష‌న్ స్కూళ్లుగా ప‌ర‌గ‌ణిస్తారన్నారు. ఇలా ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారన్నారు.1, 2తరగతులకు బోధన చేస్తారని, ప్రిపరేటరీ-1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరుగా ఏర్పాటు చేస్తారన్నారు. ప్ర‌స్తుతం ప్రాథ‌మిక స్కూళ్ల‌లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను ద‌గ్గ‌ర‌ల్లోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారన్నారు.3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలని సూచించారు. ఇలా అద‌నంగా చేరిన విద్యార్థుల‌తో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారన్నారు. 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారని తెలిపారు.విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటు చేస్తారన్నారు.ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఇక ఇంటికి స‌మీపంలో ప్రీ ప్రైమ‌రీ స్కూళ్లు ఉండేలా చూడాలన్నారు. ఫౌండేషన్‌ స్కూలు ఒక కిలోమీటర్‌ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయన్నారు.టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడడం జరుగుతుందన్నారు.ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్క‌డా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడవని ఆర్ జె డి వివరించారు.

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం…రాష్ట్రంలోనే తొలిసారిగా చీఫ్ విప్ ఆధ్వర్యంలో రాయచోటిలో నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం: డిఈఓ శైలజ.
నూతన విద్యావిధానంతో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డి ఈ ఓ శైలజ అన్నారు.నూతన విద్యా విధానం వల్ల విద్యార్థి ఒకటవ తరగతిలో చేరితే 18 సంవత్సరాల వయస్సు వరకు ఎక్కడా చదువులు ఆపకుండా విద్య నభ్యసించడం జరుగుతుందన్నారు. అటు విద్యార్థులుకు, ఉపాధ్యాయ వర్గాలకు నూతన విద్యా విధానం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నాడు నేడు, అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద పథకాలతో పాఠాశాలలకు మహర్దశ కల్గి రూపురేఖలు మారాయన్నారు.నూతన విద్యావిధానంపై రాష్ట్రం లోనే ప్రథమంగా రాయచోటిలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు.

నాడు నేడుతో న్యూ లుక్ సంతరించుకున్న పాఠశాలలు: ఎస్ ఎస్ ఏ పి ఓ ప్రభాకర్ రెడ్డి.
విద్యాశాఖలో సమూల మార్పులను సీఎం జగన్ తీసుకువచ్చారని సర్వశిక్ష అభియాన్ పి ఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు.విద్యా విప్లవానికి నాంది పలికారన్నారు.ఈ నెల 16 న పాఠశాలలు ప్రారంభమవుచున్నాయన్నారు. జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులుకు పాఠశాలల ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుక అందించడం జరుగుతుం దన్నారు. 6 నుండి 10 వ తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.జిల్లాలో నాడు నేడు క్రింద మొదటి విడతలో 1040 పాఠశాలలు, రాయచోటి నియోజక వర్గంలో 121 పాఠశాలలులో అభివృద్ధి పనులు జరిగి న్యూలుక్ సంతరించుకున్నాయన్నారు.

విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత: మదన మోహన్ రెడ్డి.
వైఎస్ ఆర్ సిపి యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

నూతన విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం సానుకూల వైఖరితో ముందుకుసాగుదాం:ఉపాధ్యాయ సంఘ నేతలు
నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ సంఘనేతలు, పలువురు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తెలిపారు.పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరాజు, వైఎస్ఆర్ టి ఎఫ్ నరసింహా రెడ్డి , రెడ్డెప్పరెడ్డి, పొట్రెడ్డి,శివశంకర్ రెడ్డి ఆర్ జె యు పి శ్రీనివాసులు, ఎస్ టి యు రవీంద్రా రెడ్డి,శివారెడ్డి,ప్రధానోపా ధ్యాయుడు వై సి రెడ్డేప్పరెడ్డి, ఇతర సంఘ నాయకులు మున్వర్, జబీర్ ఖాన్, హరిబాబు, అజకర్, సనావుల్లా, వేమిరెడ్డి సుబ్బారెడ్డి , రెడ్డేన్న, డైట్ విద్యార్థిని భవిత తదితరులు ప్రసంగించారు. నూతన విద్యా విధానం వల్ల మేధో వికాసం కలుగుతుందన్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరుగుచుండడం హర్షణీయమన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములై ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామన్నారు.

సమిష్టి కృషితో పాఠశాలలును బలోపేతం చేస్తామని, అడ్మిషన్ సమయాల్లో నో అడ్మిషన్స్ అని బోర్డులు పెట్టే స్థాయికి ఎదుగు దామన్నారు. సానుకూల ధోరణితో నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయ లోకం ప్రముఖులుగా నిలవాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేసారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి సత్కారం

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ని ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాయచోటిని విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, చీఫ్ విప్ కృషికి తాము ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రంలోనే తొలిగా రాయచోటిలో అవగాహన సదస్సును నిర్వహించిన ఘనత చీఫ్ విప్ కే దక్కుతుందన్నారు. నాడు నేడు పాఠశాలల అభివృద్ధిపనులను స్వయంగా పరిశీలించడం, తరచూ సమీక్షలు నిర్వహించడంతో నియోజక వర్గంలోని పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు శ్రీకాంత్ రెడ్డి కృషి ఆమోఘమన్నారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీ డి ఈ ఓ రంగారెడ్డి, మండల విద్యాశాఖా ధికారులు వెంకటేష్ నాయక్, గిరివరదయ్య, చక్రే నాయక్, శివానాయక్, రామాపురం సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషన్ రెడ్డి, కౌన్సిలర్లు ఆసీప్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా, అన్నా సలీం, నవరంగ్ నిస్సార్, ఉపాధ్యాయ సంఘ నాయకులు వి ఆర్ రెడ్డి తదితరులు పెద్దఎత్తున ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.