సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దళిత బంధు పధకం అమలు జరపాలని పద్మారావు గౌడ్ కు వినతి

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా దళిత బంధు పధకం అమలు జరపాలని పద్మారావు గౌడ్ కు వినతి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్,సికింద్రాబాద్: పేద దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం ఉపకరిస్తునదని జై భీం సేన హర్షం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని పార్సిగుట్ట ప్రాంతంలో కూడా ఈ ‘దళిత బంధు’ పధకం అమలును చేపట్టాలని జై భీం సేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జై భీం సేన సికింద్రాబాద్ ఇంచార్జ్ చింతల రాజేందర్ నేతృత్వంలోని ఓ ప్రతినిధుల బృందం బుధవారం సికింద్రాబాద్ లోని డిప్యూటీ స్పీకర్ టీ .పద్మారావు గౌడ్ నివాసం లో కలిసింది. ఈ క్రమంలో వారు ఓ వినతి పత్రాన్ని పద్మారావు గౌడ్ కు అందించారు. గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ లోని పార్సీగుట్ట ప్రాంతాన్ని దత్తతకు స్వీకరించి అభివృధి చేస్తామని ప్రకటించారని వారు మరోసారి గుర్తుచేశారు. కొత్తగా ప్రవేశ పెడుతున్న దళిత బంధు పధకాన్ని కూడా పార్సిగుట్ట లో వెంటనే ప్రారంభించాలని జై భీం సేన ప్రతినిధులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో పద్మారావు గౌడ్ అన్ని వర్గాల అభివృధికి కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా కొనియాడారు. నియోజకవర్గ సర్వతోముఖభివృద్దికి పాటు పడుతున్నారని ప్రశంసించారు. ప్రధానంగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎస్ సీ, ఎస్ టీ, బీ సీ, మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్నాయని, అణగారిన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడంలో పద్మారావు పాటు పడుతున్నారని జై భీం సేన ప్రతినిధులు తెలిపారు. పార్సిగుట్ట లో సైతం దళిత బంధు ను అమలు జరపాలని కోరారు.ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తెస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.