జగన్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ…

జగన్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ…

ఆర్.బి.ఎం: సీఎం జగన్ పాలనలో గ్రామీణ రహదారులకు మహర్దశ కలుగుతోందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.శుక్రవారం చిన్నమండెం మండలంలోని రూ 85 లక్షల నిధులుతో నిర్మాణాలు పూర్తయిన రెడ్డివారిపల్లె సిమెంట్ రోడ్డు ప్రారంభంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డితో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించి శిలాపలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చిన్నమండెం మండలంలోనే రూ 10.90 కోట్ల ఏ ఐ ఐ బి నిధులుతో 11 రహదారులు మంజూరు కాగా, ఇందులో 9 పూర్తయ్యాయన్నారు. ఇవి కాక చిన్నమండెం మండలంలో నూతనంగా రహదారుల నిర్మాణంలో భాగంగా బోనమల నగరి పాలెం కు రూ1.16 కోట్లు, వండాడి గాండ్లపల్లె కు రూ 98 లక్షలు ,చిన్నర్సుపల్లె మఠం వరకు రూ73 లక్షలు, పాత వట్టంవాండ్లపల్లె కు 1.29 కోట్లు, కమ్మపల్లె రామనాధపురం కు రూ66 లక్షలు, గాలివీడు రోడ్ ముల్లవారిపల్లె కు రూ 66 లక్షలు, కూతల వాండ్లపల్లెకు రూ 66 లక్షలు,దేవగుడిపల్లె కు రూ 66 లక్షల నిధులుతో నూతన రహదారులు మంజూరై, టెండర్ ప్రక్రియలో ఉన్నాయన్నారు. జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధరెడ్డి మాట్లాడుతూ బిటి రోడ్స్ రెన్యువల్స్ లో భాగంగా రెడ్డివారిపల్లె కు రూ 15 లక్షలు, సద్దలగుట్టపల్లె కు 16 లక్షలు, చిన్నరుసుపల్లె కు రూ 33 లక్షల నిధులుతో బిటి రోడ్ల రెన్యువల్స్ ను త్వరలో చేపట్టడం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఎంపిటిసి రెడ్డెప్ప, డిఈ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.