అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ

అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివరించారు. శుక్రవారం ఢిల్లీలో ఈ మేరకు ఇరువురు సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరగా ఆ మేరకు హోంమంత్రి ఢిల్లీకి ఆహ్వానించారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది, మునుగోడులో పరిస్థితి ఎలా ఉంది అని అమిత్‌షా ఆరా తీసినట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అడ్డగోలుగా సంపదను దోచేస్తున్నారని, మునుగోడులో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను అధికార టీఆర్‌ఎస్‌ వేగంగా చేస్తోందని రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గ పరిస్థితిపై అమిత్‌షాకు రాజగోపాల్‌రెడ్డి ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.