ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొందాలి: శ్రీకాంత్ రెడ్డి

ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొందాలి: శ్రీకాంత్ రెడ్డి

  • కోనంపేట రామాలయం నందు జరిగిన ధ్వజస్థంబ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్: ప్రతిఒక్కరిలో భక్తిభావం పెంపొందాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఆదివారం లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట కోదండ రామాలయం నందు జరిగిన ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్థంభ దాతలు ఎస్ ఆర్ స్టోన్ క్రషర్స్ యజమాని పుత్తా వెంకటసుబ్బారెడ్డి,తవిడిశెట్టి రమేష్ లను చీఫ్ విప్ అభినందించారు. అన్నదాన కార్యక్రమాన్ని చీలేకాంపల్లె వెంకట్రామిరెడ్డి ,గ్రామస్థులు కలసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్ పి టి సి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య, సింగిల్ విండో అధ్యక్షులు పోల్ రెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు యర్రంరెడ్డి, సర్పంచ్ లు లక్ష్మీనారాయణ, రెడ్డెయ్య, మాజీ సర్పంచ్ కొండా ప్రసాద్ రెడ్డి,సయ్యద్ అమీర్, సిద్ధక రామచంద్రారెడ్డి, సమరసింహారెడ్డి, విజయ భాస్కర్, రాజారెడ్డి, సూరం వెంకట సుబ్బారెడ్డి, పురుషోత్తం, రామయ్య, ధర్మారెడ్డి,బాబు, చెన్నకృష్ణారెడ్డి, మునిరెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.