కోవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్ ను ప్రజలు సద్వినియోగం:పద్మారావు గౌడ్ ఉప సభాపతి

కోవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్ ను ప్రజలు సద్వినియోగం:పద్మారావు గౌడ్ ఉప సభాపతి

ఆర్.బి.ఎం డెస్క్,సికింద్రాబాద్ : జీ హెచ్ ఎం సీ అధికార యంత్రాంగం సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సోమవారం నుంచి నిర్వహించనున్న కోవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ సర్కిల్ పరధిలో 100 శాతం వాక్సినేషన్ పూర్తీ చేసే దిశగా ప్రత్యేక డ్రైవ్ ను అధికారులు చేపట్టనున్నారని పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రత్యేక నోడల్ అధికారి పర్యవేక్షణలో, జోనల్ కమీషనర్ సారధ్యంలో, జీ హెచ్ ఎం సీ సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమీషనర్ పల్లె మోహన్ రెడ్డి నేతృత్వంలో వివిధ బృందాలను ఈ ప్రక్రియ అమలుకు ఏర్పాటు చేసినట్లు పద్మారావు గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్ల పరిధుల్లో ప్రతి డివిజన్ కు ఓ సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 126 కాలనీలు, బస్తీల్లో ఇంటింటి సర్వీ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా బృందాలు జనావాసాల్లో అక్కడికక్కడీ టీకాను అందించే ప్రక్రియను నిర్వహిస్తాయని పద్మారావు గౌడ్ తెలిపారు. జీ హెచ్ ఎం సీ, వైద్య శాఖకు చెందిన బృందాలు ఆయా నివాసాల్లో ప్రతీ ఒక్కరూ టీకాను పొందినదీ, లేనిదీ పరిశీలించి, నివాసాలకు స్టిక్కర్ అతికించేలా ఏర్పాట్లు జరిగాయని అయన పేర్కొన్నారు. కార్పొరేటర్లు, నేతలు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్కరూ టీకాను పొందేలా చొరవ చూపాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.