షర్మిల పార్టీని విడిన ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీలోకి ..?

షర్మిల పార్టీని విడిన ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీలోకి ..?

  • తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు రాజీనామా చేశాను: ఇందిరా శోభన్
  • మద్దతు తెలిపిన షర్మిలకు ధన్యవాదాలు:ఇందిరా శోభన్
  • త్వరలోనే రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను: ఇందిరా శోభన్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు.అయితే ఆ పార్టీలో ఆదిలోనే సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జి గా వ్యవహరించిన చేవెళ్ల ప్రతాప్ రెడ్డి కూడా పార్టీ స్థాపించిన కొద్దీ రోజులకే రాజీనామా చేశారు. తాజాగా మరో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ కూడా శుక్రవారం నాడు వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేశారు. ఇందిరా శోభన్ వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన మొదటినుండి ఆమె ఆ పార్టీకి క్రియాశీలకంగా పని చేశారు. వైఎస్ షర్మిల నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఇందిరా శోభన్ కీలక పాత్ర పోషించేది. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ తరుపున టీవీ డెబిట్ లలో పాల్గొనేది. శుక్రవారం రోజు ఇందిరా శోభన్ తన రాజీనామా పత్రాన్ని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు పంపించారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేస్తున్నానని ఇందిరా శోభన్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. తనకు పార్టీలో మద్దతుగా నిలిచి తనను ప్రోత్సహించిన వైఎస్ షర్మిలకు ఇందిరా శోభన్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని కలలు కన్నము అని ఇందిరా శోభన్ అన్నారు.త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఇందిరా శోభన్ తెలిపారు.ఇదిలా ఉంటె ఇందిరా శోభన్ తిరిగి సొంత గూటికి చేరుతారనే వార్తలు ముంచెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేతబట్టిన నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సంతరించుకుంది. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన కీలక నేతలు తిరిగి తమ సొంత గూటికి చేరుతున్నారు. ఇందిరా శోభన్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.