క్రీడా మైదాన, ప్రాంగణాల నిర్మాణాల పనులను పరిశీలించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

క్రీడా మైదాన, ప్రాంగణాల నిర్మాణాల పనులను పరిశీలించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్: రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో రూ 1.50 కోట్ల నిధులుతో జరుగుచున్న క్రీడా మైదాన, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సోమవారం సాయంత్రం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు.పనులును నాణ్యతగా, త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆయన హౌసింగ్ డిఈ శ్రీధర్ రెడ్డి ని ఆదేశించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టులు 2, హాకీ, ఫుట్ బాల్ , క్రికెట్ , స్కెటింగ్, బాస్కెట్ బాల్ తదితర కోర్టుల నిర్మాణాలును సుందరంగా తీర్చిదిద్ది, క్రీడాకారులకు, విద్యార్థులుకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా,అర్బన్ సి ఐ రాజు, పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీనివాసరాజు, వైఎస్ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్,జాకీర్, కొలిమిఛాన్ బాషా, గౌస్ ఖాన్, ఎంపిటిసి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.