వైఎస్‌ఆర్‌టీపీకి డబుల్ జోష్..

వైఎస్‌ఆర్‌టీపీకి డబుల్ జోష్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీకి డబుల్ జోష్ రానుంది. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి వర్థంతి తర్వాత ఆ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేయబోతోంది. రెండు వ్యూహాలకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పదును పెట్టబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ పార్టీ గ్రామాలే కేంద్రంగా పనిచేస్తోంది. ప్రత్యేక తెలంగాణతో తమ జీవితాలను బంగారం చేసుకోవాలని అందరూ అనుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు. తమకు ఉజ్యల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాక నిరాశతో ఇటీవల కాలంగా నిరుదోగ్యులు ఆత్మహత్యలు చేసుకుంటుంన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను వైఎస్‌ఆర్‌టీపీ సీరియస్‌గా తీసుకుంది. నిరుదోగ్య దీక్షల పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో ప్రజల జీవితాలు బాగుపడాలంటే రాజ్యాధికారమే ఏకైకమార్గమని ఆ పార్టీ అనుకుంటోంది. రాజ్యాధికారాన్ని సాధించేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. ఇప్పటికే పార్టీ నిర్మాణాలను బలపరుచుకుంటోంది. రాష్ట్ర, జిల్లా ఇన్‌ఛార్జీలతో యువజన సంఘాలను ఏర్పాటు చేసుకుంది.

అయితే సెప్టెంబర్‌ నెల వైఎస్‌ఆర్‌టీపీ కీలకం కాబోతోందని సమాచారం . ఎలాగంటే ఈ నెల నుంచే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) టీం వైఎస్‌ఆర్‌టీపీతో పనిచేయబోతోంది. షర్మిల, పీకేల మధ్య ఒప్పందం కూడా జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పీకే టీం తెలంగాణలో అడుగుపెడుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ టీంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌కు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో సీఎం కేసీఆర్ పాలనపై 84 శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ విషయాన్ని కూడా పీకేకు షర్మిలపార్టీ నేతలు వివరించినట్లు సమాచారం.

ఇక సెప్టెంబర్ 2వ తేది కూడా ఆ పార్టీకి కీలకంగా మారబోతోంది. 2వ తేదీని వైఎస్‌ఆర్‌టీపీ భవిష్యత్తుపై షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఓ కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ హైదరాబాద్ శివారులోని హోటల్‌లో నిర్వహించబోతున్నారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమావేశానికి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతలు హజరుకాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో వైఎస్ ఆత్మబంధువుగా చెప్పుకునే కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హజరవుతారని సమాచారం. వీరందరి అనుభావాలను, సలహాలను తీసుకుని వైఎస్‌ఆర్‌టీపీ ముందుకు పోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీనియర్ల్ ఇచ్చిన సలహాలపై ప్రశాంత్ కిషోర్ చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. సెప్టెంబర్ 1,2 తేదీలు వైఎస్‌ఆర్‌టీపీ కీలకం కాబోతున్నాయి. పెద్దల సూచనలు, పీకే వ్యూహాలు ఆ పార్టీకి డబుల్ జోష్ తెచ్చాయని ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.