తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా షర్మిల అడుగులు.. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అప్పుడే కుదిరిందంట..!

తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా షర్మిల అడుగులు.. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అప్పుడే కుదిరిందంట..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:  రాజకీయపార్టీల్లో వ్యూహకర్తల ట్రెండ్ నడుస్తోంది. ఆ పార్టీలను గాడ్ ఫాదర్స్, స్వంత చరిష్మా ఉన్న వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే స్వంత బలంతో పాటు వ్యూహకర్తల ఎత్తులతో అధికారంలోకి వస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖంగా ప్రశాంత్‌కిషోర్ (పీకే) పేరు వినిపిస్తోంది. ఏపీలో పీకే వ్యూహంతో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితో ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ పాత్ర మరువలేనిది. అత్యంత మోజార్టీతో జగన్ ప్రభుత్వాన్ని స్థాపించిన విషయం తెలిసిందే. ఇదే స్పూర్తితో వైఎస్‌ఆర్ కుమార్తె, జగన్ సోదరి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించాలని అడుగులు వేస్తున్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి తమ పార్టీని తేవాలని ఆమె అనుకుంటోంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని నిర్మించేందుకు జిల్లా కమిటీను పటిష్టం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌టీపీ యువతను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులోభాగంగా ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్షలతో పేరుతో నిరహారదీక్షలు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ మద్దతు కూడా వస్తోంది. వైఎస్‌ఆర్‌టీపీ యూత్ కమిటీను కూడా ప్రకటించారు. ఆరుగురు కో ఆర్టినేటర్లు, 60 మంది సభ్యులతో ఈ కమిటీని షర్మిల నియమించారు.

ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ను షర్మిల టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నారు. అటు సోషల్ మీడియాను ఇటు ప్రధాన మీడియాతో కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్కు గ్రామ స్థాయిలో బలమైన పునాదులున్నాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ తన సత్తాను చాటుకుంది. వీరందరి టార్గెట్ కేసీఆరే. ఇప్పుడు వైఎస్‌ఆర్‌టీపీ ఈ మూడు పార్టీలను నిలువరించాలని అనుకుంటోంది. అందులోభాగంగా ఆ పార్టీ, ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌టీపీ వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ బృందం వ్యవహరించబోతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మీకు ఓ అనుమానం రావచ్చు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత తాను ఇక నుంచి వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే ఇప్పటికే ప్రకటించారు.

వైసీపీకి ప్రశాంత్‌కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సమయంలో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. అప్పుడే షర్మిల, ప్రశాంత్‌కిషోర్ మధ్య ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఒప్పందం భాగంగానే సెప్టెంబర్ లో ప్రశాంత్‌కిషోర్ టీం రంగంలోకి దిగుతుందని వైఎస్‌ఆర్‌టీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని షర్మిలతో లోటస్‌పాండ్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంత్‌కిషోర్ లాంటి వ్యక్తుల సలహాలుతీసుకుంటే తప్పేంటని స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ కూడా పార్టీ నేతలతో పీకే పార్టీకి పనిచేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలమైన పునాదున్న ఈ మూడు పార్టీలను తట్టుకుని షర్మిల నిలదొక్కకుంటూదో లేదో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published.