రాయచోటి ఏరియా ఆసుపత్రి పరిశీలనలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

రాయచోటి ఏరియా ఆసుపత్రి పరిశీలనలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం డెస్క్: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిని చీఫ్ విప్ సందర్శించారు. కోవిడ్ వార్డ్ , జనరల్ వార్డులను పరిశీలించారు. కోవిడ్ కు వైద్యం పొందుతున్న బాధితుని దగ్గరికి వెళ్లి పరామర్శించి మనో ధైర్యం కల్పించారు. ఇతరత్రా రోగులకు అందుతున్న సేవలుపై ఆయన ఆరా తీశారు.ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించి ఆక్సిజన్ ఉత్పత్తి , సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. వందపడకల ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ థర్డ్ వేవ్ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వైద్యాధికారులును ఆయన ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల ప్రేమ, దయతో సేవలు అందించాలన్నారు. లీకేజీ అవుతున్న భవనాలకు తక్షణమే చర్యలు చేపట్టి లీకేజీలును అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులును ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్, ఆసుపత్రి పర్యవేక్షకుడు డా మహేశ్వర రాజు, వైద్యాధికారులు డా రెడ్డి భాస్కర్ రెడ్డి,డా ఖదీర్, వై ఎస్ ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా, అన్నా సలీం, గువ్వల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.