ప్రజా సంగ్రామ యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి..

ప్రజా సంగ్రామ యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ రథసారధి బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి జనార్ధన్ రెడ్డి తెలిపారు. నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని ఆర మైసమ్మ వద్దకు చేరుకుంది.ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులు పెద్ద ఎత్తున ఘనంగా ఆహ్వానం పలికారు.

చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. పాదయాత్ర మొదలైన రోజు నుండి ప్రజలు బండి సంజయ్ గారిని ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని బి జనార్దన్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ పాదయాత్ర లో భాగస్వాములు కావాలని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరికి వచ్చాయని ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రతో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న మార్పు ఈ యాత్రతో వస్తుందని జనార్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నట్టు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి బిజెపి నాయకులు సామ రంగారెడ్డి,శ్రీధర్,కొమురయ్య,మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.