కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ : కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.సంబేపల్లె మండలం నారాయణరెడ్డి గారిపల్లె గ్రామం పొన్నెళ్ల వాండ్లపల్లెలో 22 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు.ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని తహసీల్దార్ కు సూచించామన్నారు. ఆరోగ్యకర ఇబ్బంది పరిస్థితులున్న పాజిటివ్ వ్యక్తులకు అండగా ఉంటామన్నారు.రాయచోటి ఏరియా ఆసుపత్రి, కడప రిమ్స్ తదితర ఆసుపత్రులలో వైద్యసేవలు అందేలా చూస్తామన్నారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు తిరగకుండా ఉండాలని ఆయన సూచించారు. మాస్క్ ధారణ, వ్యక్తిగత శుభ్రతలు తప్పక పాటించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు,ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మరికొంత కాలం జాగ్రత్తగా ఉండాలన్నారు.కోవిడ్ బాధితులు కానీ ,ఆ లక్షణాలున్న వారికి ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ ద్వారా కూడా సంప్రదించినా తోడ్పాటు అందిస్తామన్నారు.వైద్యులను అప్రమత్తం చేశామన్నారు.రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ కూడా సిద్ధంగా ఉందన్నారు. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో మందులు కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులుకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published.