చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసింది కెసిఆర్: రేవంత్ రెడ్డి

చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసింది కెసిఆర్: రేవంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కెసిఆర్ కేటీఆర్ చెప్పులు మోసి,ఎంగిలి మెతుకులు తిని బతికారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు లేకపోతే ఈ రోజు చంద్రశేఖర్ రావు ఎక్కడుండేవాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తారక రామారావు పేరు మార్చుకొని రఖుల్ రావు గా పెట్టుకోమని గతంలోనే చెప్పానని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డి ని సెమి ఫైనల్స్ లోనే ఓడించానని మల్లారెడ్డి దుఃఖంలో ఏదేదో మాట్లాడుతున్నాడని  మల్లారెడ్డి  బాధలో ఉన్నాడని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాని తక్షణమే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏంటో ప్రజలు ఎవరికీ బుద్ది చెప్తారో తెలుస్తుందని కెసిఆర్ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వాని రద్దు చేయడానికి కెసిఆర్ కు తమ కుటుంబ సభ్యుల వల్ల వ్యక్తిగతంగా ఏమైనా భయం ఉంటె కెసిఆర్ తన నియోజకవర్గానికి రాజీనామా చేసి మళ్ళి ఎన్నికల్లో పోటీ చేయాలనీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.