దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోంది:శ్రీకాంత్ రెడ్డి

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోంది:శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: సమీక్షా సమావేశంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు ఎన్నో పథకాలనురాష్ట్ర
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉందని తెలిపారు. రాయితీతో వేరుశెనగను ఇస్తున్న విధంగానే సన్ ఫ్లవర్ ను కూడా రాయితీతో రైతులకు అందించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఏ ప్రాంతంలో ఏఏ పంటలు సాగు అవుతాయో ఆ మేరకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తృణ ధాన్యాలను ఎక్కువగా ప్రమోట్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చర్ ల్యాబ్ లలో అవసరమైన ఎక్యుప్ మెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను కోరారు. రాయచోటి ప్రాంతంలో ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ అవసరమవుతుందని ముఖ్యమంత్రిని కోరామని తెలుపగా… రాయచోటిలో మిల్లెట్ ప్రాసెస్సింగ్ యూనిట్ ఏర్పాటుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జకీయా ఖానం, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, పి రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సలహామండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ ఝాన్సీ రాణి, జేసి ఎం.గౌతమి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.