మేదరుల సంక్షేమానికి కృషి: శ్రీకాంత్ రెడ్డి.

ycp mla sreekanthreddy

మేదరుల సంక్షేమానికి కృషి: శ్రీకాంత్ రెడ్డి.

  • సూర్యనారాయణపురంలో జరిగిన ప్రపంచ మేదరుల దినోత్సవంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం : మేదరుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రామాపురం మండలం సూర్యనారాయణపురం మేదరపల్లెలో నిర్వహించిన ప్రపంచ వెదుర దినోత్సవంలో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మేదర కులగురువు శ్రీశ్రీ కేతయ్య చిత్ర పటానికి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ ద్వారక నాథరెడ్డి లు పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచీకరణ వ్యవస్థ రావడంతో మేదరుల జీవనం అస్తవ్యస్థంగా తయారైందన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రావడంతో వెదురుతో తయారు చేసే వస్తువులు కనుమరుగయ్యాయని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేదరులతో పాటు ఆయా కులాలను ఆదుకోవడానికి కృషి చేస్తున్నారన్నారు. బడుగు, వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక కార్పోరేషన్ లును ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషిచేస్తున్నారు. రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులుకు ఏటా రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ఈ మాదిరిగానే మేదరులకు రూ 10 వేలు అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.అరకు, పశ్చిమ గోదావరి ప్రాంతాలలో బొంగు చికెన్ తదితర ఆహార వంటకాలు ప్రాచుర్యం పొందాయని, ఆ మాదిరిగానే మన ప్రాంతాల్లో కూడా చేస్తే మేదరులకు జీవనోపాధి పెంపొందుతుందన్నారు.మేదరుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేసి మేదరులకు గుర్తింపు తీసుకువస్తామన్నారు. మాజీ ఎంఎల్ఏ ద్వారక నాధ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు వెదురు ఎంతో ఉపయోగప డుతుందన్నారు. మేదరులు వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎం ఎల్ ఏ ద్వారక నాధ రెడ్డి లను మేదరులు ఆత్మీయంగా సన్మానించారు.వెదురుతో తయారుచేసిన కిరీటం, గద తదితర వస్తువులుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి జనార్దన రెడ్డి, మేదర సంఘం రాష్ట్ర చైర్మన్ టంగుటూరి ఎల్లాల బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మాజీ సర్పంచ్ ఆర్ల చిన్న సుబ్బయ్య, మేదర సంఘ నాయకులు ఆది నారాయణ,వెంకట సుబ్బయ్య,నారాయణమ్మ, రెడ్డెయ్య , వై ఎస్ ఆర్ సిపి నాయకులు కర్ణప విశ్వనాథరెడ్డి గ్రామ సర్పంచులు నాగభూషణ్ రెడ్డి, ముంగర సుబ్బయ్య, రఘు, మునీర్ బాషా, శివయ్య, సూరం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.