జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ..

boxing

జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ..

ఆర్.బి.ఎం డెస్క్: 4 వ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ క్రిడాకారులు విజయ కేతనం ఎగరవేశారు. వివిధ విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ తన నివాసంలో సత్కరించి అభినదించారు. హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుందని మొహమ్మద్ అలీ స్పష్టం చేశారు. జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో గెలిచి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మొహమ్మద్ అలీ క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.ఎస్ రఘు , వైస్ ప్రెసిడెంట్ మారుతీ , జనరల్ సెక్రటరీ రఘువీర్ ,ట్రెసరర్  బండారి ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భవాని ప్రసాద్ ,కోచ్ మహర్షి, సంతోష్ లు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో తమ సత్తాచాటిన క్రీడాకారుల వివరాలు: 10-09-2021 నుండి 13-09-2021 హర్యానా స్టేట్ సోనిపట్ గ్రామంలోని సత్యం మోడల్ స్కూల్ లో SM బాక్సింగ్ క్లబ్ వేదికగా బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 4 వ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అండర్ 12 ఇయర్స్ ,సుబీజునియర్ , జూనియర్స్ ,యూత్ ,సీనియర్ ఎలైట్ మెన్ & విమెన్ పోటీలలో తెలంగాణ స్టేట్ జట్టు విజయాలను సాధించింది ,మొత్తం 48 మెడల్స్ సాధించగా ఇందులో స్వర్ణం 18,వెండి 19, కాంశ్యమ్ 11, గెలుచుకోగా మొత్తం 158 పాయింట్స్ తో టీం ఛాంపియన్షిప్ లో 2 వ స్థానం సాధించుకొని రన్నర్ అప్ గా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published.