రోజాకు నవంబర్ గండం…! ఎంత పని చేసుకున్నావు మేడమ్..!

అమరావతి: సీఎం జగన్ తన కేబినెట్‌ను మరోసారి ప్రక్షాలన చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో నలుగురైదుగురికి నవంబర్ నెలలో ఉద్వాసన పలుకుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరా నలుగురైదుగురు అన్న చర్చ మంత్రులను భయపెడుతోంది. వీరిలో ఉత్తరాంధ్రా నుంచి ఒకరు. గోదావరి జిల్లాలలో ఒక మహిళా మంత్రితో పాటు రాయలసీమలో ఒకరు. కోస్తాలో ఇంకొకరు ఉంటారని చెబుతున్నారు. ఈ నలుగురిలో ఎక్కువగా మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. అయితే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడానికి పలు రకాల కారణాలు చెబుతున్నారు. రోజా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అధిష్టానం సూచనలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రోజా తన స్వంత అజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జబర్దస్త్ కార్యక్రమాలకు వెళ్లకూడదని వైసీపీ అధిష్టానం ఆమెకు అల్టిమేటం జారీ చేసిందట. అయితే పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి దసరా సందడి పేరిట జబర్దస్త్‌లో ఒక ఈవెంట్ నిర్వహిస్తే రోజా ఆ కార్యక్రమానికి ఆమె వెళ్లారని అంటున్నారు. మళ్లీ బుల్లితెరపై సందడి చేయడం పార్టీ ప్రతిష్టకు చెడ్డపేరు తెస్తుందని పలువురు జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించడంపై అధిష్టానం సీరియస్‌గా ఉందని అంటున్నారు.

అయిదు నెలల మంత్రిగా రోజా తన నియోజకవర్గంలో కానీ తన శాఖ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదని నివేదికలు ఉన్నాయి. గడపగడపకు ప్రోగ్రాంకు సరిగ్గా వెళ్ళని వారిలో రోజా పేరు కూడా ఉందని చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో కూడా రోజా గ్రాఫ్ బాగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఆమె తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇవన్నీ చూసుకుంటే రోజా పదవి పోవడం ఖాయమే అంటున్నారు. జగన్‌కే ఆగ్రహం కలిగించే విధంగా రోజా వ్యవహారశైలి ఉందని అందువల్ల ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.